More
    Homeఅంతర్జాతీయంTrump Tariffs | ఆ దేశాల సోలార్​ ప్యానెళ్లపై అమెరికా భారీ సుంకాలు.. భారత్​కు మేలు

    Trump Tariffs | ఆ దేశాల సోలార్​ ప్యానెళ్లపై అమెరికా భారీ సుంకాలు.. భారత్​కు మేలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు US President డోనాల్డ్​ ట్రంప్ Donald Trump​ రోజుకో నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నారు. అన్ని దేశాలపై ప్రతికార సుంకాలు విధించిన ట్రంప్​ తర్వాత ఆ నిర్ణయాన్ని 90 రోజులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే చైనా chinaపై మాత్రంగా భారీగా సుంకాలు tariffs విధించారు. మొదట 145శాతం సుంకాలు వేశారు. దీంతో డ్రాగన్​ దేశం సైతం అమెరికా ఉత్పత్తులపై 125శాతం సుంకాలు విధించడంతో పాటు విలువైన ఖనిజాల ఎగుమతులను Minerals exports నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ట్రంప్​ చైనాపై 245 శాతం టారిఫ్స్​ విధిస్తున్నట్లు ప్రకటించారు.

    Trump Tariffs | 3,521శాతం సుంకాలు

    ట్రంప్​ చైనాపై విధిస్తున్న టారిఫ్​ల భయంతో చాలా కంపెనీలు చైనాను వదిలి ఇతర దేశాలకు వెళ్తున్నాయి. ముఖ్యంగా సోలార్​ ప్యానెళ్లు solar panels ఎగుమతి చేసే కంపెనీలు ఆగ్నేయ ఆసియాకు తమ కార్యకలాపాలను తరలించాయి. తాజాగా ట్రంప్​ ఆ దేశాలపై కూడా సుంకాల మోత మోగించారు. ఆగ్నేయ ఆసియా దేశాలైన కంబోడియా, వియత్నం, మలేషియా, థాయిలాండ్​లో ఉత్పత్తి అయిన సోలార్​ ప్యానెళ్లపై 3,521శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. కంబోడియా Cambodia సౌర విద్యుత్ పరికరాలపై 3,521 శాతం, వియత్నం Vietnam లోని కంపెనీలపై 395.9 శాతం వరకు టారిఫ్​లను విధించారు. అలాగే థాయిలాండ్ Thailand​ ఉత్పత్తులపై 375.2 శాతం, మలేషియా Malaysiaపై 34.4 శాతంగా నిర్ణయించారు.

    Trump Tariffs | భారతీయ కంపెనీలకు మేలు

    అమెరికాకు సౌర విద్యుత్​ పరికరాలు ఎగుమతి చేసే దేశాల్లో భారత్ bharat​ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆగ్నేయ ఆసియా దేశాల సౌర ఉత్పత్తులపై ట్రంప్​ టారిఫ్​ల మోత మోగించడంతో భారతీయ కంపెనీలకు indian companies మేలు జరగనుంది. భారత విదేశాంగశాఖ దీనిని అడ్వాంటేజ్​గా తీసుకుంటే.. మన ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.

    Trump Tariffs | భారీగా పెరిగిన వారీ ఎనర్జీస్​ స్టాక్​

    అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోలార్​ విద్యుత్ solar power​ అసవరం లేదని ప్రకటించారు. దీంతో భారత్​ నుంచి అమెరికాకు సోలార్​ విద్యుత్ పరికరాలు ఎగుమతి చేసే వారి ఎనర్జీస్​ waree energies కంపెనీ స్టాక్​ భారీగా పడిపోయింది. తాజాగా ట్రంప్​ పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడంతో పాటు, వారీ ఎనర్జీస్​ కంపెనీకి మంచి లాభాలు రావడంతో ఆ కంపెనీ షేర్​ దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ స్టాక్​ ఏకంగా 34శాతం పెరగడం గమనార్హం. బుధవారం ఒక్క రోజే ఈ స్టాక్​ 16శాతం పెరిగింది.

    Latest articles

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు Ghat Road లో గురువారం ప్రమాదం...

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...

    More like this

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు Ghat Road లో గురువారం ప్రమాదం...

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...