అక్షరటుడే, న్యూఢిల్లీ: America : భారత్(BHARATH)టు, చైనా(CHINA)కు అమెరికా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. రష్యా (Russia) తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో సెనెట్‌లో బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం Senator Lindsey Graham ఈ విషయాలు వెల్లడించారు.
‘రష్యా నుంచి చమురును భారత్, చైనా 70 శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇలాంటి దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధించేలా చర్యలు తీసుకుంటాం’ అని లిండ్సే వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ విధమైన బిల్లును ఆగస్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఈ విధమైన బిల్లుకు ట్రంప్ సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు.
America : ఆర్థికంగా దెబ్బతీసేందుకేనా..
అగ్ర రాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ కలిగిన ఆమెరికా.. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. దీనికి అధ్యక్షుడు ట్రంప్ వంత పాడటం యూఎస్‌కు కలిసొస్తోంది. ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సెనెటర్ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటున్నారు.
రష్యా నుంచి భారత్, చైనా పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా సెనెటర్ చెప్పిన బిల్లు అమల్లోకి వస్తే.. ఈ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్ ఔషధాలు, వస్త్రాల వంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావమే పడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉక్రెయిన్ కు అండగా ఉంటూ వస్తున్న యూఎస్.. ఆ దేశానికి మద్దతు తెలిపే రాజ్యాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు ప్రచారంలో ఉంది.
America : తక్కువ సుంకాలతో ఒప్పందం..!
ఇదిలా ఉంటే.. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. చాలా తక్కువ సుంకాలతో ఈ ఒప్పందం ఉండనున్నట్లు పేర్కొన్నారు. కాగా, భారత్ ఇంకా దీనికి తమ అంగీకారం తెలపలేదన్నారు. వారు ఒప్పుకొంటే తక్కువ సుంకాలు విధించేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా, జులై 9వ తేదీ లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.