More
    Homeక్రీడలుAmbati Rayudu | నా ఉద్దేశం అది కాదు.. నన్ను క్షమించండి: అంబటి రాయుడు

    Ambati Rayudu | నా ఉద్దేశం అది కాదు.. నన్ను క్షమించండి: అంబటి రాయుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ambati Rayudu | భారత ప్రజలకు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్షమాపణలు చెప్పాడు. భారత్-పాకిస్థాన్ (india-pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతను చేసిన ఓ ట్వీట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపరేషన్ సిందూర్‌కు (operation sindoor) ప్రతీకారంగా పాకిస్థాన్.. భారత సరిహద్దు నగరాలపై దాడులకు పాల్పడటంతో గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్ మ్యాచ్‌ను రద్దు (punjab kings and delhi capitals match suspend) చేశారు. దేశ సరిహద్దు నగరాల్లో బ్లాకౌట్ (country border citys announced blackout) పాటించడంతో ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పాకిస్థాన్ దాడులను (pakistan attacks) భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

    READ ALSO  Olympic Day | అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం.. క్రికెట్​కు ఒలింపిక్స్‌లో దక్కిన చోటు.. ఇదొక చారిత్ర‌క ఘ‌ట్టం

    ఈ ఉద్రిక్తతలను ఉద్దేశించిన అంబటి రాయుడు ఓ ట్వీట్ (ambati rayudu tweet) చేశాడు. ‘కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది’ అనే మహాత్మ గాంధీ కొటేషన్‌ను (mahthma gandhi quetetion) పంచుకున్నాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వాన్ని (india governament), ఆపరేషన్ సిందూర్‌ను (operation sindoor) తప్పు పట్టేలా ఈ ట్వీట్ ఉందని మండిపడ్డారు. కొందరైతే జుగుప్సాకరమైన రీతిలో కామెంట్ చేశారు. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించిన రాయుడు.. వరుస ట్వీట్స్‌తో డ్యామెజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా నెటిజన్లు శాంతించలేదు. దాంతో ఆ కొటేషన్‌ వెనుక ఉన్న ఉద్దేశంపై రాయుడు ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

    ‘భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో (india-pakistan borders) నెలకొన్న పరిస్థితిపై నేను చేసిన ఓ ట్వీట్‌పై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ట్వీట్‌ను అపార్థం చేసుకున్నారు. భారత బలగాలను తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. ఈ కఠినమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (prime minister narendra modi) నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు (operation sindoor) నేను పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ధైర్య సాహాసాలు కలిగిన మన భారత సైన్యానికి (indian army) నేనెప్పుడూ అండగా ఉంటాను. భారతీయుల మనోభావాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. జై హింద్. జై భారత్ (jai hind jai bharath). అని ట్వీట్ చేశాడు.

    READ ALSO  Pakistan Defense Minister | ఇండియా నిఘా స‌మాచారం ఇచ్చింది చైనాయే.. పాకిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ వెల్ల‌డి

    Latest articles

    Elevated corridor | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. ఎలివేటేడ్​ కారిడార్ల​ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Elevated corridor | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటు వాహనాల...

    Nizamabad City | కేంద్ర హోం మంత్రి పర్యటన.. వామపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit...

    Air India | విమానంలో పొగలు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | అహ్మదాబాద్​ ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad​ Air India...

    Kethireddy Pedda Reddy | తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kethireddy Pedda Reddy | అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు...

    More like this

    Elevated corridor | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. ఎలివేటేడ్​ కారిడార్ల​ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Elevated corridor | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటు వాహనాల...

    Nizamabad City | కేంద్ర హోం మంత్రి పర్యటన.. వామపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit...

    Air India | విమానంలో పొగలు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | అహ్మదాబాద్​ ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad​ Air India...