More
    HomeజాతీయంAmarnath Yatra | వచ్చే వారమే అమర్ నాథ్ యాత్ర షురూ.. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న...

    Amarnath Yatra | వచ్చే వారమే అమర్ నాథ్ యాత్ర షురూ.. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న భద్రతా బలగాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amarnath Yatra | అత్యంత ప్రతిష్టాత్మక, ఆధ్యాత్మిక యాత్రగా భావించే అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్ర సజావుగా సాగడానికి జమ్మూ ప్రభుత్వం (Jammu government) భారీ భద్రతను ఏర్పాటు చేసింది. బహుళ అంచెల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు కశ్మీర్ పోలీసు చీఫ్ వీకే బిర్డి (Kashmir Police Chief VK Birdi) బుధవారం తెలిపారు. “ఈ సంవత్సరం శ్రీ అమర్నాథ్ యాత్ర వచ్చే వారం ప్రారంభమవుతుంది. జమ్మూ-కశ్మీర్ పోలీసులు (Jammu and Kashmir Police). ఇతర భద్రతా దళాలు యాత్ర కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి యాత్రను సురక్షితంగా, సజావుగా చేయడానికి బహుళ అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశామని” అని కశ్మీర్ పోలీసు ఇన్​స్పెక్టర్​ జనరల్ తెలిపారు.

    READ ALSO  Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    Amarnath Yatra | భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

    పహల్గామ్ మీదుగా సాగే అమర్ నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్లపై వీకే బిర్డి బుధవారం సమీక్షించారు. నున్వాన్ బేస్ క్యాంప్(Nunwan base camp)ను సందర్శించిన ఆయన.. జూలై 3 నుంచి ప్రారంభమయ్యే తీర్థయాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. 38 రోజుల పాటు సాగే తీర్థయాత్రకు భద్రతా ఏర్పాట్లను జోనల్తో సహా వివిధ స్థాయిలుగా విభజించామని, యాత్రకు ముందు బుధవారం భద్రతా కసరత్తులు జరిగాయని ఐజీ చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి సమయంలో అప్రమత్తతను, సంసిద్ధతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కసరత్తులు జరిగాయని వివరించారు. యాత్రకు స్థానికుల మద్దతు గురించి విలేకరులు ప్రశ్నించగా.. స్థానిక జనాభా మద్దతు లేకుండా యాత్ర నిర్వహణ సాధ్యం కాదన్నారు. భద్రతా దళాలు దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam), అనంత్నాగ్, ఖాజిగుండ్, శ్రీనగర్​లోని పంథా చౌక్, ఉత్తర కశ్మీర్​లోని బండిపోరా జిల్లాలోని సుంబల్లలో కసరత్తులు నిర్వహించాయి.

    READ ALSO  Traffic control | అక్కడ ట్రాఫిక్​ నియంత్రణ.. ఉల్లంఘనులకు జరిమానా ఇక ఏఐతోనే..!

    Latest articles

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    More like this