అక్షరటుడే, ఇందూరు: Alumni Friends | నగరంలోని పద్మానగర్ విశ్వశాంతి హైస్కూల్ (Vishwashanti High School) పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం(Spiritual communion) ఘనంగా నిర్వహించారు. 2008-09 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
అనంతరం విద్యాబుద్ధులను నేర్పిన ఉపాధ్యాయులు హరిదాస్, ఇంద్ర, స్వప్న, గణేష్, రమేష్, సుజాతను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రేవంత్ కుమార్, శివ, ఆశిష్, స్వరణ్ సింగ్, శివ ప్రసాద్, సాయి శ్రావణ్, వైష్ణవి, మాధురి, మౌనిక, వాణి తదితరులు పాల్గొన్నారు.