More
    HomeసినిమాWaves Summit | ‘వేవ్స్‌’లో చిరంజీవి గురించి గొప్ప‌గా మాట్లాడిన అల్లు అర్జున్.. ఇంకా ఏమన్నాడంటే..!

    Waves Summit | ‘వేవ్స్‌’లో చిరంజీవి గురించి గొప్ప‌గా మాట్లాడిన అల్లు అర్జున్.. ఇంకా ఏమన్నాడంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Waves Summit | పుష్ప‌2 చిత్రంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా సినిమాకి ప‌రిణితి చెందుతూ బాక్సాఫీస్ లెక్క‌లు మార్చేస్తున్నాడు. తాజాగా బ‌న్నీ ముంబైలో జరిగిన WAVES సమ్మిట్ (WAVES 2025) కు హాజరయ్యారు. ఇక చిట్ చాట్‌లో కూడా బ‌న్నీ పాల్గొని అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. మా తాత రామ‌లింగ‌య్య వెయ్యి సినిమాల‌లో న‌టించారని, త‌న తండ్రి అల్లు అర‌వింద్ 70 సినిమాలు నిర్మించార‌ని, మా మామ చిరంజీవి సౌత్‌లో సూపర్‌స్టార్‌. మా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ సపోర్ట్‌తో తాను ఈ స్థాయికి వ‌చ్చాను అని బ‌న్నీ అన్నారు. త‌న‌కి అభిమానులు అంటే ప్రాణం అని చెప్పారు. వారిని దృష్టిలో పెట్టుకునే వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తున్నాను అని స్ప‌ష్టం చేశారు.

    READ ALSO  Naga Vamsi | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ చూశాక అంతా దాని గురించే చ‌ర్చ‌.. నిర్మాత స్ట‌న్నింగ్ కామెంట్స్

    Waves Summit | క్రేజీ కామెంట్స్

    మావయ్య చిరంజీవి Chiranjeevi నాకు ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ఆయ‌న ఇన్సిపిరేష‌న్‌తోనే నేను న‌టుడిని అయ్యాను అని ‘వేవ్స్'(Waves) కార్యక్రమంలో చెప్పాడు బన్నీ. ఇక నా ఫిట్‌నెస్‌కు కారణం నా మానసిక ప్రశాంతతే. షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచే డాన్స్‌ అంటే ఇష్టం. డ్యాన్స్ బాగా వేసేవాడిని. మరింత రాటుదేలేందుకు ట్రైన‌ర్ సాయం తీసుకున్నా అని బ‌న్నీ అన్నారు. ఇక త‌న 10వ సినిమాలో యాక్సిడెంట్ జ‌రిగింది. అప్పుడు ఆరునెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ సవాళ్లు అధిగమించా.. మళ్లీ సినిమాలు చేశా. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. 20వ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. పుష్ప సినిమా(Pushpa Movie)తో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది.

    READ ALSO  Rashmika Mandanna | విజ్జూ అంటూ ప్రేమగా పిలిచిన రష్మిక.. మరోసారి హాట్ టాపిక్‌గా ర‌ష్మిక‌- విజ‌య్ ప్రేమ వ్య‌వ‌హారం

    సినిమా లేన‌ప్పుడు హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. ప్రతి నటుడికి ఫిట్‌నెస్(Fitness) అనేది చాలా ముఖ్యం. నేను సిక్స్‌ ప్యాక్‌(Six Pack) కోసం చాలా కష్టపడ్డా. అలాగే 18వ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆత్మ పరిశీలన చేసుకున్నా. ఫ్లాప్‌ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎవరైనా మంచి కోసమే సలహాలు ఇస్తారు. ఎంతోమంది పెద్దలు నాకు సలహాలు ఇస్తారు. వాటిని త‌ప్ప‌క పాటిస్తా అని బ‌న్నీ Allu Arjunఅన్నారు. అట్లీ సినిమా గురించి చెబుతూ, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్(International Standards) లో ఈ మూవీ ఉంటుందని తెలిపారు. ఇండియన్‌ మూవీస్‌లోనే ఇలాంటి మూవీ రాలేదు. ఒక గొప్ప సినిమాని చూడబోతున్నారని, ఇండియా సెన్సిబులిటీస్‌తో ఉండే ఇంటర్నేషనల్‌ మూవీ అని తెలిపారు.

    Latest articles

    Thailand PM | ఫోన్ కాల్ లీక్‌.. థాయ్ ప్ర‌ధానికి ఉద్వాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Thailand PM | ఫోన్ కాల్ లీకేజీతో మ‌రో ప్ర‌ధాని త‌మ ప‌ద‌విని కోల్పోయారు. థాయిలాండ్ ప్రధాన...

    Donald Trump | ట్రంప్, మ‌స్క్ మ‌ధ్య మ‌ళ్లీ లొల్లి.. అవి ఆపేస్తే టెస్లా అధినేత దుకాణం స‌ర్దేసుకుంటాడన్న అమెరికా అధ్యక్షుడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్...

    Rail One App | రైల్వే నుంచి సూపర్‌ యాప్‌.. ఇక అన్ని సేవలు ఒకే వేదికపై..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rail One App | భారతీయ రైల్వే(Indian Railway) సూపర్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రయాణంలో అవసరమయ్యే అన్ని...

    TGS RTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. డిజిటల్​ పేమెంట్​కు శ్రీకారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGS RTC | తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్​...

    More like this

    Thailand PM | ఫోన్ కాల్ లీక్‌.. థాయ్ ప్ర‌ధానికి ఉద్వాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Thailand PM | ఫోన్ కాల్ లీకేజీతో మ‌రో ప్ర‌ధాని త‌మ ప‌ద‌విని కోల్పోయారు. థాయిలాండ్ ప్రధాన...

    Donald Trump | ట్రంప్, మ‌స్క్ మ‌ధ్య మ‌ళ్లీ లొల్లి.. అవి ఆపేస్తే టెస్లా అధినేత దుకాణం స‌ర్దేసుకుంటాడన్న అమెరికా అధ్యక్షుడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్...

    Rail One App | రైల్వే నుంచి సూపర్‌ యాప్‌.. ఇక అన్ని సేవలు ఒకే వేదికపై..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rail One App | భారతీయ రైల్వే(Indian Railway) సూపర్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రయాణంలో అవసరమయ్యే అన్ని...