అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా సైతం పలు నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా తిరుమలలో జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Brake Darshan) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రోటోకాల్ ప్రముఖులు మినహా ఇతరులకు వీఐపీ దర్శనాలు ఉండవని స్పష్టం చేసింది.