More
    Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. రేపే ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. రేపే ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించి వివిధ టికెట్ల బుకింగ్​ తేదీలను ప్రకటించింది. ఆగస్టుకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, వసతి కోసం ఆన్‌లైన్ కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్(TTD official website)​లో రేపు (మే 19న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌(Online)లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారు మే 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తే లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

    Tirumala | 22న ఆర్జిత సేవా టికెట్లు

    శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్స‌వాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

    READ ALSO  Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    Tirumala | అంగప్రదక్షిణం టోకెన్లు

    ఆగ‌స్టుకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను మే 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో పెట్టనుంది.

    Tirumala | ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా

    ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై కోటాను మే 29న ఉదయం 11 గంటలకు టీటీడీ తన వెబ్​సైట్​(Web Site)లో విడుదల చేయనుంది.

    READ ALSO  Bonalu Festival | గోల్కొండలో మెట్ల బోనాలు ప్రారంభం

    Latest articles

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...

    Gujarat High Court | వర్చువల్ విచారణలో షాకింగ్ ఇన్సిడెంట్​.. వాష్‌రూమ్ నుంచి కోర్టుకు హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gujarat High Court | మన దేశంలో న్యాయవ్యవస్థకు, న్యాయస్థానాలకు ఎంతో గౌరవం ఉంటుంది. కోర్టు...

    More like this

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    ACB Raids | బీసీ హాస్టల్​లో ఏసీబీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | నాగర్​కర్నూల్ (Nagar Kurnool)​ జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ...