More
    HomeసినిమాAkhanda 2 | అఖండ 2 డిజిట‌ల్ హ‌క్కుల కోసం భారీ డిమాండ్.. ఇండ‌స్ట్రీలో ఇదే...

    Akhanda 2 | అఖండ 2 డిజిట‌ల్ హ‌క్కుల కోసం భారీ డిమాండ్.. ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Akhanda 2 | హ్యాట్రిక్ కాంబో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) కాంబోలో ‘అఖండ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్, అఖండ చిత్రాలతో ఈ జోడి హ్యాట్రిక్ కొట్టడంతో ‘అఖండ 2’పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ‘అఖండ’ నుంచి ఓటమి ఎరుగని బాలయ్య ఇటీవలే ‘ఢాకు మహరాజ్‌’తో మరో హిట్టు ఖాతాలో వేసుకున్నారు. ఓ హీరో, డైరెక్టర్ కలిసి హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రికార్డు అసలు ఈ మధ్యకాలంలో లేదు. వీరి కలయికలో నాలుగో చిత్రంగా వస్తోన్న ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులే కాదు ఓటీటీ సంస్థలు కూడా ఎదురుచూస్తున్నాయి. బాలయ్య కెరీర్​లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఓటీటీ రైట్స్ దక్కించుకునేందుకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ పోటీపడుతున్నాయి.

    READ ALSO  Akkineni akhil marriage | అఖిల్ పెళ్లిలో మెరిసిన టబు.. నాగ్​ మాజీ గార్ల్ ఫ్రెండ్ కూడా వ‌చ్చిందా అంటూ కామెంట్స్

    Akhanda 2 | మాములు విష‌యం కాదు..

    ఎన్ని రూ.కోట్లు ఇచ్చి అయినా సరే ఓటీటీ రైట్స్ తామే తీసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ 2 (Akhanda 2) తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులపై భారీ డీల్ సాగుతోందని సినీవర్గాల్లో చర్చలు న‌డుస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియో ఈ చిత్రం ఓటీటీ హక్కుల కోసం రూ.80 కోట్లు ఇవ్వాలని అనుకుంటుంద‌ట‌. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 14 రీల్స్ సంస్థతో కలిసి బాలయ్య చిన్నకూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్​లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకంగా 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. దీంతో ముందుగానే నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తిచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

    READ ALSO  Tollywood Industry | చంద్ర‌బాబుతో టాలీవుడ్ ప్ర‌ముఖుల మీటింగ్ క్యాన్సిల్.. కార‌ణం ఏంటంటే..!

    అయితే సినిమా బడ్జెట్‌లో 40 శాతం ఓటీటీ హ‌క్కుల రూపంలో వ‌స్తుంద‌ని తెలిసి ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అఖండ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌కు తోడు బాలయ్య మాస్ ఇమేజ్ వల్లే ఈ స్థాయి ఆఫర్ వచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అఖండ (2021) సినిమాకు ఓటీటీలో మంచి స్పందన లభించిందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం పెట్టడానికి సిద్ధంగా ఉందట. అయితే ఇది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ డీల్​పై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని టాలీవుడ్(Tollywood) టాక్​ నడుస్తోంది. ఒకవేళ ఇది ఖరారైతే, అఖండ 2 డిజిటల్ మార్కెట్‌లోనే కాకుండా సినిమా రైట్స్ రంగంలోనూ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన‌ట్టే. కాగా.. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చిందో మ‌నం చూశాం.

    READ ALSO  Gaddar Film Awards | అట్ట‌హాసంగా గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌.. ఒకే ఫ్రేమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, అల్లు అర్జున్

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....