అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fighter Jet | భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. రాజస్థాన్(Rajasthan)లోని చురు జిల్లాలోని భానుడా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో స్థానికులు అక్కడకు భారీగా చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force)కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం(Fighter Jet) కూలిపోయింది. సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నట్లు చేపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పైలెట్(Pilot) మృతి చెందినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.