అక్షరటుడే, వెబ్‌డెస్క్: Farmers | కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా (Nizamabad District) రైతులకు శుభావార్త చెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా మరో రెండు సంస్థలను ఇందూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయ భవనాన్ని ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పసుపు ఎగుమతులను ప్రోత్సహించడానికి జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (NCEL), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్‌లను(NCOL) నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.
పసుపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంలో భాగంగా నిజామాబాద్‌లో (Nizamabad) ఈ సంస్థలను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంస్థలు పసుపు ఎగుమతులను పెంపొందించడంలో, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. రైతులకు న్యాయమైన లాభాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.