అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Aegis Vopak Terminals | ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ వారం మరో మెయిన్‌బోర్డు ఐపీవో (Main board IPO) ప్రారంభమవుతోంది. ఇన్వెస్టర్లనుంచి రూ.2,800 కోట్లు సమీకరించేందుకు ఏజిస్ లాజిస్టిక్స్ (Aegis logistics) అనుబంధ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం తాజా షేర్ల జారీ ద్వారా జరగనుంది.
Aegis Vopak Terminals | కంపెనీ వివరాలు, పనితీరు..
ఏజిస్ వోపాక్ టెర్మినల్(Aegis Vopak Terminals) దేశంలోని ఆరు ప్రధాన ఓడరేవులలో 20 ట్యాంకులను నిర్వహించే ప్రముఖ కంపెనీలలో ఒకటి. LPG, చమురు, ద్రవ రసాయనాలు, పెట్రోకెమికల్స్, వాయువులు, కూరగాయల నూనె తదితర ఉత్పత్తుల నిల్వ, రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది.
2023లో రూ.355.99 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం 2024లో రూ.570.12 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్ వరకు రూ.476.15 కోట్లుగా రికార్డయ్యింది. 2023లో రూ. 0.08 కోట్ల నష్టం రాగా.. 2024లో రూ. 86.54 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లుగా కంపెనీ పేర్కొంది. 2024 డిసెంబర్ వరకు లాభం రూ.85.89గా ఉంది.
Aegis Vopak Terminals | సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ (Subscription) సోమవారం ప్రారంభమై 28న ముగుస్తుంది. అలాట్‌మెంట్ స్టేటస్ 29వ తేదీ రాత్రి విలువడే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు వచ్చేనెల 2వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్(List) కానున్నాయి.
Aegis Vopak Terminals | ధరల శ్రేణి..
రూ.223 నుంచి రూ.235గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 63 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు(Retail Investors) ఒక లాట్ కోసం రూ.14,805 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Aegis Vopak Terminals | కోటా, జీఎంపీ..
QIBలకు 75 శాతం, HNIలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం గ్రేమార్కెట్ ప్రీమియం 6 శాతమే ఉంది.