అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aditya Pharmacy MD | ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించిన ఆయన విజయవాడ(Vijayawada)లోని అయోధ్యనగర్ క్షత్రియ భవన్(Ayodhyanagar Kshatriya Bhavan)లో బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఓ స్నేహితుడిని హత్య చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇటీవల బెయిల్పై వచ్చిన నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
నరసింహరాజు (Narasimha Raju) గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. విశాఖ, విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. డబ్బులు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.