అక్షరటుడే, వెబ్‌డెస్క్: DMHO | నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై scanning centers చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri Nizamabad హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘం district level advisory committee సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మూడు డివిజన్లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తుమన్నామన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో scanning centers చేసే ప్రతి పరీక్షను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. బోధన్‌లోని Bodhan ఓ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు సుప్రియ, బిందు, శ్రావణి, తదితరులున్నారు.
