అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్ మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఓమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ.. కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి అచ్యుతానందన్కృషి ఎంతో ఉందన్నారు. నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, కులరహిత సమాజం కోసం, కార్మిక వర్గాల రాజ్యాధికారం కోసం పనిచేశారని గుర్తు చేశారు. పదహారేళ్ల వయసులో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు హన్మాండ్లు, రఘురాం నాయక్, భానుచందర్, రేవతి, మహేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Achuthanandan | సీపీఎం ఆధ్వర్యంలో..
కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మృతి తీరనిలోటని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. నగరంలోని నాందేవ్వాడలో ఉన్న కార్యాలయంలో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ…కేరళలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా అలుపెరుగని పోరాటం చేశారన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట రాములు, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, సురేష్, నగర నాయకులు రాములు, అనసూయమ్మ, దినేష్, రాజు, ఉద్ధవ్ తదితరులు పాల్గొన్నారు.