అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సింగరేణిలో acb raids Singareni అవకతవకలు జరుగుతున్నాయని ఆ సంస్థ అధికారులు.. ఏసీబీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో తనిఖీలు చేశారు. అనంతరం సింగరేణి మెయిన్ వర్క్‌షాప్ డ్రైవర్ రాజేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు.
రాజేశ్వర్‌రావు ఉద్యోగాలు, మెడికల్ అన్‌ఫిట్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే బదిలీలు చేయిస్తానని చెప్పి కార్మికుల నుంచి డబ్బు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో మరికొంత మంది పేర్లు తెరమీదకి వచ్చే అవకాశం అవకాశం ఉంది.
ACB | అపోహలు వద్దు.. పనులు జరుగుతాయి
ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. అధికారులు ఎవరైనా రూ.వంద లంచం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏదైనా పని కోసం లంచం అడిగిన అధికారిపై ఫిర్యాదు చేస్తే ఆ పని కాదేమోనని ప్రజలు భయపడొద్దన్నారు. పని పూర్తయ్యే వరకు ఏసీబీ బాధితులకు తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు.