Site icon aksharatoday.in

RTA Offices | రాష్ట్ర వ్యాప్తంగా ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

RTA Offices

RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు పెరుగుతున్నాయని ఇటీవల ఏసీబీ(ACB)కి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని పలు ఆర్​టీఏ కార్యాలయాలతో పాటు, చెక్​పోస్టు(Check Post)లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుమలగిరి(Tirumalagiri)లో ఇద్దరు క్లర్క్‌లతో పాటు 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అదుకారులు(ACB officers) పట్టుకున్నారు.

RTA Offices | అవినీతి కేంద్రాలుగా ఆర్టీఏ కార్యాలయాలు

రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలు(RTA Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. వాహనాల రిజిస్ట్రేషన్​, లైసెన్స్​ కోసం వచ్చే వారి నుంచి అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. నేరుగా లైసెన్స్(License)​ కోసం వెళ్తే అధికారులు పనులు చేయడం లేదు. అదే ఏజెంట్లు, బ్రోకర్లను వెంట పెట్టుకొని వెళ్తే నిమిషాల్లో లైసెన్స్​ జారీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల హవా నడుస్తుంది. వారు లేకుండా వెళ్తే లైసెన్స్​ రావడం గగనమే.

RTA Offices | చేతులు తడిపితే లైసెన్స్​

ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు ఏజెంట్లు చెప్పిన వారికి ఏమి చూడకుండానే లైసెన్స్​ ఇస్తున్నారు. ఎంతో మంది కారు వాహనాల డ్రైవింగ్​ రాకున్నా.. అధికారుల చేతులు తడిపి లైసెన్స్​ పొందుతున్నారు. లంచం ఇవ్వకపోతే డ్రైవింగ్​ వచ్చిన వారి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారుల అవినీతి, ఏజెంట్ల దందాపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అధికారులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version