అక్షరటుడే, వెబ్‌డెస్క్: RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు పెరుగుతున్నాయని ఇటీవల ఏసీబీ(ACB)కి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలతో పాటు, చెక్‌పోస్టు(Check Post)లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుమలగిరి(Tirumalagiri)లో ఇద్దరు క్లర్క్‌లతో పాటు 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అదుకారులు(ACB officers) పట్టుకున్నారు.
RTA Offices | అవినీతి కేంద్రాలుగా ఆర్టీఏ కార్యాలయాలు
రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలు(RTA Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ కోసం వచ్చే వారి నుంచి అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. నేరుగా లైసెన్స్(License) కోసం వెళ్తే అధికారులు పనులు చేయడం లేదు. అదే ఏజెంట్లు, బ్రోకర్లను వెంట పెట్టుకొని వెళ్తే నిమిషాల్లో లైసెన్స్ జారీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల హవా నడుస్తుంది. వారు లేకుండా వెళ్తే లైసెన్స్ రావడం గగనమే.
RTA Offices | చేతులు తడిపితే లైసెన్స్
ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు ఏజెంట్లు చెప్పిన వారికి ఏమి చూడకుండానే లైసెన్స్ ఇస్తున్నారు. ఎంతో మంది కారు వాహనాల డ్రైవింగ్ రాకున్నా.. అధికారుల చేతులు తడిపి లైసెన్స్ పొందుతున్నారు. లంచం ఇవ్వకపోతే డ్రైవింగ్ వచ్చిన వారి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారుల అవినీతి, ఏజెంట్ల దందాపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అధికారులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.