అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అంతేగాకుండా అక్రమాలు జరుగుతున్న పలు శాఖలపై ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం కామారెడ్డి(Kamareddy) జిల్లా రాజంపేట మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్ పోస్టు(Pondurthi RTA Check Post)పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
చెక్ పోస్టులో లారీల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చెక్ పోస్టు సిబ్బంది నియమించుకున్న ఏజెంట్లు లారీ డ్రైవర్ల (Lorry Drivers) నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను అధికారులు లెక్కిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ACB Raid | ఇష్టారీతిన వసూళ్ల దందా
రాష్ట్రంలోని ఆర్టీఏ చెక్‌పోస్టులలో ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు గతంలో సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో జూన్ 26న రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్‌పోస్టులు, ఆర్టీఏ కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో రూ.1,81,030 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ACB Raid | అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో..
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం(Madnur Mandal) సలబత్‌పూర్ వద్ద మహారాష్ట్ర సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టులో గత నెల 26న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఏఎంవీఐ కవితతో పాటు సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రిపూట చెక్‌పోస్ట్ సిబ్బంది తనిఖీల పేరిట వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెక్‌పోస్టులో లెక్కకు మించి ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. 20 రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేయడం గమనార్హం. ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు.