అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raid | రాష్టంలో ఏసీబీ అధికారుల దాడులతో Attacks by ACB officers అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ శాఖపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుందోననే గుబులు పట్టుకుంది. సోమవారం ఒక్కరోజే ఏకంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అవినీతి జలగలు పట్టుబడడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ACB Raid | భద్రాద్రి కొత్తగూడెంలో సీఐ.. రిపోర్టర్..
లంచం తీసుకుంటూ ఓ సీఐ inspectorతో పాటు, టీవీ చానెల్ రిపోర్టర్ ఏసీబీ ACBకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు Manugoor పోలీస్ స్టేషన్ Police Station ఎస్‌హెచ్‌వో SHO సతీశ్‌కుమార్ ఓ కేసులో పేర్లు చేర్చకుండా ఉండటానికి రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ACBని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఎస్‌హెచ్‌వో సతీశ్‌కుమార్‌తో పాటు, బిగ్ టీవీ రిపోర్టర్ big TV reporter గోపీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపల్ శాఖపై దాడి..
బిల్లులు చెల్లించడానికి లంచం bribe demand డిమాండ్ చేసిన అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. సీసీ రోడ్డు cc road పనులకు సంబంధించిన రూ.11 లక్షల బిల్లుల bills కోసం ఓ కాంట్రాక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మున్సిపల్ nagaram municipal అధికారులను సంప్రదించాడు. బిల్లులకు మంజూరు చేసేందుకు డిప్యూటీ ఈఈ deputy ee sudarshanam సుదర్శనం, వర్క్ ఇన్స్పెక్టర్లు(ఔట్ సోర్సింగ్) రాకేశ్, సురేశ్ రూ.1.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల acb officials medchalకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ముగ్గురిని నేరుగా పట్టుకున్నారు.
ACB Raid |నిజామాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖలో..
నిజామాబాద్ జిల్లాలో Nizamabad district ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి acb trap nizamabad చిక్కాడు. ఆర్మూర్‌లోని పంచాయతీ రాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను ఏసీబీ acb cases today అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నందిపేట్‌కు చెందిన ఓ గుత్తేదారు నుంచి ఈయన రూ.7 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా, లంచం ఇవ్వడం ఇష్టంలేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పక్కా పథకం ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ లంచం డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.