అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PUBG | ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ smart phone యుగంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఫోన్‌కు బానిసలు అవుతున్నారు. నిత్యం ఫోన్ phone చూస్తూ ఎంతో మంది గడిపేస్తున్నారు. సోషల్ మీడియా social media లో గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు ఫోన్లలో గంటల కొద్దీ గేమ్‌లు games ఆడుతున్నారు. అయితే గంటల కొద్ది స్మార్ట్‌ఫోన్ చూస్తే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాగే ఓ యువకుడు రోజూ గంటల తరబడి ఫోన్లో పబ్‌జీ గేమ్ ఆడి పక్షవాతానికి గురయ్యాడు. ఢిల్లీకి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు నిత్యం 12 గంటల పాటు పబ్‌జీ గేమ్ ఆడేవాడు. గేమింగ్‌కు బానిసైన ఆ యువకుడికి పాక్షిక పక్షవాతం Partial paralysis వచ్చింది. దీంతో వెన్నెముకకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
PUBG | వెన్నెముకపై ప్రభావం
నిత్యం గంటల కొద్దీ అదే పనిగా ఫోన్లో గేమ్ ఆడడంతో ఆ యువకుడి వెన్నెముకపై తీవ్ర ప్రభావం పడింది. చివరకు అతను తన మూత్రాశయంపై నియంత్రణ కోల్పోయాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్ చేసిన వైద్యులు క్షయవ్యాధి అతడి వెన్నెముక ఎముకలకు సోకిందని చెప్పారు. టీబీ, అదే పనిగా గేమింగ్ వ్యసనంతో ఇలా జరిగిందని వివరించారు. అనంతరం వైద్యులు అతడికి ఆపరేషన్ చేయడంతో కోలుకున్నాడు.