అక్షరటుడే, నిజాంసాగర్ : Alumni Reunion | వాళ్లంతా 40 ఏళ్ల క్రితం ఒకే దగ్గర చదువుకున్నారు. ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినా ఒకే వేదికపై కలవాలని సంకల్పించారు. ఈ మేరకు నాడు చదువుకున్న విద్యార్థులు అంతా కలిసి ‘పునర్ మిలన్’ పేరిట ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.
బిచ్కుంద (Bichkunda) పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt Junior College)లో 1984 – 85 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక బండయప్ప ఫంక్షన్ హాల్ (Bandayappa Function Hall)లో కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా గడిపారు. తమకు తవిద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. అప్పటి ప్రిన్సిపల్ రాజయ్య గుప్తా, ఉపాధ్యాయులు రమేష్ రావు, నాగనాథ్, సంగప్ప ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో వారిని ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు బండాయప్ప మఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్తో తదితరులు హాజరయ్యారు.