అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఆడపిల్ల అంటే అంగట్లో సరుకులా మారిపోయింది. నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్ నగరం(Nizamabad City)లో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను బేరం పెట్టారు.
వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి(One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్(Mirchi Compound)కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనించింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్(Solapur)కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవో(CPDO) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది.
కాగా.. సమాజంలో ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఇంకా ఏదో మూల దాగే ఉందనేది ఇలాంటి ఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది.