అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా అందించడం లేదని పేర్కొంటూ మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) ఆధ్వర్యంలో వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి లింకులు లేకుండా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Gandhari | కృత్రిమ కొరత సృష్టించవద్దు..
సొసైటీలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోవట్లేదని వారు పేర్కొన్నారు. రైతులకు సరిపడా యూరియా వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.