అక్షరటుడే, ఇందూరు: Sigachi Industry | సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు (Additional Collector Kiran Kumar) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pasha mailaram) సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో 45 మంది మృతి చెందారన్నారు. వీరితోపాటు పలువురు తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు.
Sigachi Industry | పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలన్నింటిలోనూ (large industries) సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వారి రక్షణ కోసం పరికరాలు అందించాలన్నారు. వలస కార్మిక చట్టం అమలుపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీఐటీయు (CITU) జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ (TUCI) జిల్లా కార్యదర్శి సుధాకర్, ఐఎఫ్టీయూ (IFTU) జిల్లా కార్యదర్శి దాసు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమాన్లు, టీఆర్ఎస్కేవీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, వెంకన్న, రాజేశ్వర, సాయరెడ్డి, రాములు, రఫీయుద్ధీన్, చక్రపాణి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.