అక్షరటుడే, కామారెడ్డి: Tiger | రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా (Reddypet School Thanda) అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా తండా శివారులో పులి సంచరిస్తున్నట్టుగా ప్రజలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఆవుపై (Cow) పులి దాడి చేసి చంపిందని పేర్కొన్నారు.
Tiger | ఆవుపై దాడికి యత్నం..
తాజాగా ఆదివారం మరోసారి ఓ ఆవుపై దాడి చేయగా.. గొంతుకు తీవ్ర గాయమైందని తెలిపారు. పెద్ద పులి సంచారిస్తోందని ప్రచారం జరగడంతో స్కూల్ తండా, బట్టు తండా(battu thanda), జగదాంబ తండా (జగదాంబ తండా) ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటు వైపు వెళ్లేందుకు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆవుపై పులి దాడి చేసిన విషయాన్ని తండా వాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ఈ విషయమై ఎఫ్డీవో రామకృష్ణను వివరణ కోరగా ఫారెస్ట్ రేంజ్ పెద్దది కావడంతో పెద్దపులి తిరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు పెద్దపులి తిరిగినట్టుగా అడుగులు గుర్తించామని తెలిపారు. పెద్ద పులిని గుర్తించేందుకు అడవిలో సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.