అక్షరటుడే, ఇందూరు:Shankar Bhavan | కేంద్ర ప్రభుత్వం(Central Government) అందజేస్తున్న పీఎంశ్రీ నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల(Shankar Bhavan School) అభివృద్ధి జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. మంగళవారం పాఠశాల వార్షికోత్సవానికి school anniversary హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, నాణ్యతను మెరుగుపర్చడానికి పీఎంశ్రీ పథకం(PMShri scheme) కింద గతేడాది రూ.27లక్షలు, అటల్ టింకరింగ్ ల్యాబ్(Atal Tinkering Lab) కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించామన్నారు.
మన ఊరు – మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాలు (Amma Adarsh Schools Schemes) పేరుకే పరిమితమవుతున్నాయన్నారు. అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యమన్నారు. భవిష్యత్తులో శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి తన ట్రస్ట్(Trust) ద్వారా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ deo nizamabad Ashok, ఎంఈవో సాయ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లేశం, రామచందర్, టీపీటీఎఫ్ నాయకుడు వెనిగళ్ల సురేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.