More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | ఉగ్రవాదులకు సరైన శిక్ష: మాజీ సైనికుల మనోగతం

    Operation Sindoor | ఉగ్రవాదులకు సరైన శిక్ష: మాజీ సైనికుల మనోగతం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి భారత్ ధీటైన జవాబునిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్​లోని ఉగ్ర స్థావరాలపై భీకరమైన వైమానిక దాడులు చేసి పలువురిని మట్టుబెట్టింది. ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ ఘటనపై మాజీ సైనికులు, అగ్నివీరులు, ఎన్​సీసీ అధికారులు తమ అభిప్రాయాన్ని ‘అక్షరటుడే’(Akshara Today)తో పంచుకున్నారు.


    Operation Sindoor | అవకాశం ఉంటే మళ్లీ యుద్ధం చేస్తా..

    – హర ప్రసాద్, సైనిక సంక్షేమ సంఘం, మాజీ జిల్లా అధ్యక్షుడు

    పహల్గామ్​లో పర్యాటకులపై(Tourists) ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రదాడిపై భారత ఆర్మీ(Indian Army) ధీటుగా స్పందించింది. పాకిస్థాన్​ పౌరులను కాకుండా ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా దాడికి దిగింది. అవకాశం ఉంటే మళ్లీ యుద్ధంలో పాల్గొనాలని ఉంది. గతంలో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్​(Indian Air Force)లో విధులు నిర్వహిస్తూ.. కార్గిల్ యుద్ధం(Kargil War)లో పాల్గొన్నాను.

    READ ALSO  US Attacks on iran | యుద్ధ రంగంలోకి అమెరికా.. వ‌ర‌ల్డ్ వార్ దిశ‌గా ప‌రిణామాలు..!

    Operation Sindoor | ఉగ్రవాదులకు ఇది చావుదెబ్బ

    – మధుసూదన్, రిటైర్డ్ ఆర్మీ

    పహల్గామ్​ ఉగ్రదాడితో భారత సైన్యం సరైన పనిచేసింది. పాకిస్థాన్​(Pakistan)లోని ఉగ్రవాద స్థావరాలకు ఇది చావుదెబ్బ. భారత సైన్యం(Indian Army) తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. అప్పుడు సర్జికల్ స్ట్రైక్(Surgical strike).. ఇప్పుడు ఆపరేషన్స్ సిందూర్(Operations Sindoor)​తో కోలుకోలేని దెబ్బతీసింది. ఉగ్రవాదులు భారత్ చేతుల్లో నుంచి తప్పించుకోలేరు.

    Operation Sindoor | పహల్గామ్​ మృతులకు నిజమైన నివాళి

    – శివ, అగ్నివీర్ సైనికుడు

    మన సైన్యం చాలా బలంగా ఉంది. భారత్​(India)ను ఎదుర్కొనే బలం పాకిస్థాన్​కు లేదు. పహల్గామ్ పర్యాటక మృతులకు ఇది నిజమైన నివాళి. అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకోడానికి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి.

    Operation Sindoor | కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సరైన సమయం

    – లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఎన్సీసీ అధికారి

    READ ALSO  Nobel Prize | ట్రంప్​ శాంతి దూత.. నోబెల్​ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇదే సరైన సమయం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్​కు మన సైన్యం మంచి జవాబునిచ్చింది. శత్రు రాజ్యాలకు కూడా హెచ్చరించిన వాళ్లమయ్యాం. యుద్ధం చేసైనా పీవోకే(POK)ను స్వాధీనం చేసుకోవాలి.

    Latest articles

    Today Gold Price | త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఎక్కడైనా ఎప్పుడైనా భారత మ‌హిళ‌లు బంగారంపై Goldఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌టం...

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    More like this

    Today Gold Price | త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఎక్కడైనా ఎప్పుడైనా భారత మ‌హిళ‌లు బంగారంపై Goldఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌టం...

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...