అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో Gachibowli మంగళవారం హైడ్రా Hydra కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా నిర్మించిన illegally constructed సంధ్య కన్వెన్షన్ సెంటర్ Sandhya Convention Center మినీ హాల్‌తో పాటు పలు ఫుడ్ కోర్టులను కూడా హైడ్రా అధికారులు తొలగించారు. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హోసింగ్ సొసైటీ లే ఔట్లో అక్రమ కట్టడాలు ఉన్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.
లే అవుట్‌లోని రోడ్లు, పార్కులను కలుపుతూ నిర్మాణాలు చేపట్టారు. దీంతో అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు, వంటగదులు, రెస్ట్ రూమ్‌లను కూల్చివేశారు. లే అవుట్‌ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ తొలగించారు. జీ ప్లస్ 2 గా నిర్మించిన మూడు షెడ్లను కూడా హైడ్రా సిబ్బంది కూల్చి వేశారు. భారీగా కమర్షియల్ షెడ్లు తొలగిస్తున్న క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.