ACB Raid | అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న ఏసీబీ..
ACB Raid | అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న ఏసీబీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB Raid | రాష్టంలో ఏసీబీ అధికారుల దాడులతో Attacks by ACB officers అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ శాఖపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుందోననే గుబులు పట్టుకుంది. సోమవారం ఒక్కరోజే ఏకంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అవినీతి జలగలు పట్టుబడడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ACB Raid | భద్రాద్రి కొత్తగూడెంలో సీఐ.. రిపోర్టర్​..

లంచం తీసుకుంటూ ఓ సీఐ inspectorతో పాటు, టీవీ చానెల్​ రిపోర్టర్​ ఏసీబీ ACBకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు Manugoor పోలీస్​ స్టేషన్ Police Station​ ఎస్​హెచ్​వో SHO సతీశ్​కుమార్​ ఓ కేసులో పేర్లు చేర్చకుండా ఉండటానికి రూ.4 లక్షల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ACBని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఎస్​హెచ్​వో సతీశ్​కుమార్​తో పాటు, బిగ్​ టీవీ రిపోర్టర్ big TV reporter​ గోపీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ACB Raid | మల్కాజ్​గిరి జిల్లాలో మున్సిపల్​ శాఖపై దాడి..

బిల్లులు చెల్లించడానికి లంచం bribe demand డిమాండ్​ చేసిన అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. సీసీ రోడ్డు cc road పనులకు సంబంధించిన రూ.11 లక్షల బిల్లుల bills కోసం ఓ కాంట్రాక్టర్​ మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలోని నాగారం మున్సిపల్ nagaram municipal అధికారులను సంప్రదించాడు. బిల్లులకు మంజూరు చేసేందుకు​ డిప్యూటీ ఈఈ deputy ee sudarshanam సుదర్శనం, వర్క్​ ఇన్​స్పెక్టర్లు(ఔట్​ సోర్సింగ్​) రాకేశ్​, సురేశ్​ రూ.1.30 లక్షల లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల acb officials medchalకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ముగ్గురిని నేరుగా పట్టుకున్నారు.

ACB Raid |నిజామాబాద్​లో పంచాయతీరాజ్​ శాఖలో..

నిజామాబాద్​ జిల్లాలో Nizamabad district ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి acb trap nizamabad చిక్కాడు. ఆర్మూర్​లోని పంచాయతీ రాజ్​ శాఖలో ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ విభాగంలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను ఏసీబీ acb cases today అధికారులు సోమవారం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నందిపేట్​కు చెందిన ఓ గుత్తేదారు నుంచి ఈయన రూ.7 వేలు లంచం డిమాండ్​ చేశాడు. కాగా, లంచం ఇవ్వడం ఇష్టంలేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పక్కా పథకం ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు సీనియర్​ అసిస్టెంట్​ శ్రీనివాస్​ శర్మ లంచం డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అరెస్ట్​ చేశారు.