అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Plaza | ఛత్తీస్‌గఢ్ Chhattisgarhలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీగా ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్‌లు నేలకూలాయి. గాలుల దాటికి రాయ్‌పూర్ Raipur జిల్లా టిల్డా మండలం తారపొంగి గ్రామ సమీపంలోని టోల్ ప్లాజా toll plaza పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. రేకులు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
గాలికి కొట్టుకుపోయిన టోల్ ప్లాజా
నిన్న రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు, కొట్టుకుపోయిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్ జిల్లా టిల్డా మండలం తారపొంగి గ్రామ సమీపంలోని టోల్ ప్లాజా pic.twitter.com/t5V5oueH14
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025