More
    Homeక్రీడలుIPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై...

    IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా తప్పుకుంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఆ జట్టుకు 8వ పరాజయం. సీఎస్‌కే మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు. ఈ క్రమంలోనే సీఎస్‌కే వచ్చే సీజన్‌పై ఫోకస్ పెట్టింది.

    టీమ్‌కు అవసరమయ్యే ఆటగాళ్లు ఎవరు? భారంగా మారిన ప్లేయర్లు ఎవరు? అనేది తెలుసుకోవడంపై కార్యచరణ మొదలు పెట్టింది. ధోనీ ms dhoni కూడా వచ్చే ఏడాదికి సంబంధించిన సన్నాహకాలు మొదలు పెడుతామని ఇప్పటికే స్పష్టం చేశాడు. కుర్రాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపాడు.

    READ ALSO  Ravi Shastri | ధోనిని ర‌వి శాస్త్రి జేబు దొంగ‌తో పోల్చాడేంటి.. !

    ఆపరేషన్ సీఎస్కే operation CSK పేరిట.. జట్టుకు భారంగా మారిన ఐదుగురి ఆటగాళ్లపై వేటు పడనుంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సామ్ కరణ్‌, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్‌లపై యాజమాన్యం వేటు వేయనుంది. వారిని అప్‌కమింగ్ సీజన్ వేలం ముందు జట్టు నుంచి రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్‌ ashwin ను రూ.9.75 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇచ్చింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. చివరకు తుది జట్టులో చోటు కోల్పోయాడు.

    దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్‌లు సైతం జట్టుకు భారంగా మారారు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో చెన్నై విజయవకాశాలు దెబ్బతీశారు. ఆల్‌రౌండర్ సామ్ కరణ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ ఐదుగురి ఆటగాళ్లకు సీఎస్‌కే ఉద్వాసన పలకాలనుకుంటుంది.

    READ ALSO  Finn Allen | సిక్సుల వ‌ర్షం కురిపించిన ఆర్సీబీ స్టార్.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు

    Latest articles

    OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి...

    Amaravati | అమరావతి ముఖ ద్వారం చూశారా.. ముస్తాబ‌వుతున్న‌ మూలపాడు..!

    అక్షరటుడే, అమరావతి: Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. విజయవాడ -...

    World Karate Day | ఘనంగా వరల్డ్ కరాటే దినోత్సవ వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: World Karate Day : తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ(Telangana Lee Martial Arts...

    Trump warns Khamenei | నిన్ను చంపడం చిటికెలో పని.. ఖమేనీకి ట్రంప్​ వార్నింగ్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump warns Khamenei: ఇజ్రాయిల్ - ఇరాన్ పరస్పర భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ దేశాల...

    More like this