More
    Homeతెలంగాణకామారెడ్డిGGH Kamareddy | జీజీహెచ్​లోకి అంబులెన్స్​లు వెళ్లేదెట్లా..!

    GGH Kamareddy | జీజీహెచ్​లోకి అంబులెన్స్​లు వెళ్లేదెట్లా..!

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: GGH Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి (Government General Hospital) సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రిలో పార్కింగ్ (Parking)​ సమస్య తలనొప్పిగా మారింది. ఆస్పత్రి లోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడం.. లోపల కార్లు, ఆటోలు పార్కింగ్​ చేసి ఉంటుండడంతో అంబులెన్స్​లు వచ్చి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    GGH Kamareddy | ఇరుకైన పార్కింగ్​..

    గురువారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి రోగులను తీసుకుని ఒకే సమయంలో మూడు 108 అంబులెన్సులు జీజీహెచ్(GGH)​కు వచ్చాయి. పార్కింగ్ స్థలంలో అప్పటికే వైద్యులకు సంబంధించిన కార్లు ఉన్నాయి. బైకులు, ఆటోలతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో రోగులను తీసుకుని వచ్చిన 108 వాహనాలు కనీసం అక్కడ యూటర్న్ తీసుకుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

    GGH Kamareddy | సెక్యూరిటీ సిబ్బందికి కష్టాలు..

    ఆస్పత్రి సెక్యూరిటీ (Hospital Security) సిబ్బంది అతికష్టం మీద బైక్​లను, ఆటోలను పంపించి 108 వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. జీజీహెచ్​కు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది. ఆస్పత్రిలో పార్కింగ్ స్థలం లేక వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్కింగ్ విషయం సెక్యూరిటీల గార్డులకు తలనొప్పిగా మారుతోంది. కొందరు వాహనదారులు సెక్యూరిటీపైకి దాడులకు యత్నించిన ఘటనలూ ఉన్నాయి. ఆస్పత్రిలో పార్కింగ్​ను క్రమబద్ధీకరించాలని.. అంబులెన్స్​లు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Hailstorm | హైదరాబాద్​లో వడగళ్లు..కుమ్మేసిన క్యుములోనింబస్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hailstorm : హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌,...

    earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేల్​పై 5.4 తీవ్రత నమోదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.4గా...

    Vijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కేసు న‌మోదు

    అక్షరటుడే, హైదరాబాద్: Vijay Devarakonda : రౌడీబాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ vijay devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు...

    Indian Premier League 2025 | రోబో డాగ్ వ‌ల‌న బీసీసీఐకి లేని పోని చిక్కులు.. ఏకంగా హైకోర్టు నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Premier League 2025 : ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో అనేక హైలైట్స్ చోటు చేసుకుంటుండ‌టం మ‌నం...

    More like this

    Hailstorm | హైదరాబాద్​లో వడగళ్లు..కుమ్మేసిన క్యుములోనింబస్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hailstorm : హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌,...

    earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేల్​పై 5.4 తీవ్రత నమోదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.4గా...

    Vijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కేసు న‌మోదు

    అక్షరటుడే, హైదరాబాద్: Vijay Devarakonda : రౌడీబాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ vijay devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు...
    Verified by MonsterInsights