అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేతో దేశవ్యాప్తంగా రోహింగ్యాల లేక్కతేలిపోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal) అన్నారు. గురువారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ప్రధాని మోదీ(Prime Minister Modi), రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(State President Kishan Reddy), ఎంపీ అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయం మేరకే జనగణన.. కులగణన(Caste Census) నిర్వహించనున్నారని తెలిపారు. దేశంలో కులగణన తమ ఒత్తిడి మేరకే నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్(Congress) చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్రం నిర్వహించే కులగణన నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాష్ట్రంలో జరిపిన కులగణన అస్పష్టంగా ఉందని, అన్ని తప్పులేనని విమర్శించారు. కేంద్రం నిర్వహించే సర్వేతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో.. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో.. పూర్తి లెక్క తేలుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు న్యాలం రాజు, పోతంకర్ లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, స్రవంతి రెడ్డి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.