More
    HomeతెలంగాణTelangana | కేసీఆర్ బాట‌లోనే రేవంత్‌.. పాల‌నా నిర్ణ‌యాల్లో అదే వైఖ‌రి

    Telangana | కేసీఆర్ బాట‌లోనే రేవంత్‌.. పాల‌నా నిర్ణ‌యాల్లో అదే వైఖ‌రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Telangana | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్(KCR) బాట‌లోనే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) న‌డుస్తున్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం(BRS Government) త‌ర‌హాలోనే అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టిన రేవంత్‌.. ఇప్పుడ‌వే విధానాల‌ను అనుస‌రిస్తుండ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

    కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను న‌మ్మిన అధికారుల‌కు పెద్ద‌పీట వేశారు. రిటైర్డ్ అయిన‌ప్ప‌టికీ.. ఆయా అధికారుల‌కే పెత్త‌నం అప్ప‌గించారు. వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రేవంత్‌రెడ్డి వంటి వారు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించుకోకుండా ముఖ్య‌మైన ప‌ద‌వుల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని రేవంత్‌రెడ్డి అనుస‌రిస్తున్నారు.

    Telangana | అధికారుల్లో అసంతృప్తి…

    వాస్త‌వానికి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారిని కీల‌క బాధ్య‌త‌ల్లో కూర్చోబెట్ట‌డం బీఆర్ఎస్(BRS) నుంచే మొద‌లైంది. రిటైర్డ్ అయిన ఐఏఎస్‌(IAS)లు, ఐపీఎస్‌(IPS)లు దాదాపు 70 మందికి వివిధ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింది.

    దీనిపై అప్ప‌ట్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఎంతో మంది స‌మ‌ర్థ‌వంతులైన అధికారులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం (Government) వారికి అవ‌కాశ‌మివ్వ‌లేదు. ఉన్న‌త ప‌ద‌వులు అనుభ‌వించి రిటైర్డ్(Retired) అయిన అధికారులనే తెచ్చి మ‌ళ్లీ త‌మ నెత్తిన రుద్ద‌డంపై అధికారుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. అయితే, కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో రేవంత్‌రెడ్డి.. వివిధ శాఖ‌ల్లో పాతుకుపోయిన‌ రిటైర్డ్ అధికారుల‌ను సాగ‌నంపారు.

    Telangana | రేవంత్‌ది కేసీఆర్ బాటే

    మ‌ళ్లీ ఏమైందో ఏమో కానీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బాట‌లోనే న‌డుస్తున్నారు. రిటైర్డ్ అయిన అధికారుల‌కు పెత్త‌నం అప్ప‌గిస్తున్నారు. ఆ మ‌ధ్య ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన మాజీ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి(Former DGP Mahender Reddy)కి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తాజాగా ఇటీవ‌ల రిటైర్డ్ అయిన శాంతికుమారికి సైతం ఎంసీహెచ్ఆర్‌డీ (MCHRD)లో కూర్చోబెట్టారు. గ‌తంలో ఇలాగే చేసిన కేసీఆర్‌పై తీవ్రంగా విమ‌ర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడ‌దే సిద్ధాంతాన్ని ఫాలో కావ‌డంపై అటు అధికారుల‌ను, ఇటు ప్ర‌జ‌ల‌ను విస్మయానికి గురి చేస్తోంది. అధికారంలో లేన‌ప్పుడు ఒక‌లా, అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విమ‌ర్శ‌లకు తావిస్తోంది.

    Latest articles

    NEET Exam | నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్​ పరీక్షపై...

    Hyderabad | మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | ఈ చిత్రాన్ని చూస్తే ‘మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను.. చినుకె కురిసెను..’ అంటూ...

    APPSC | గ్రూప్​ –1 షెడ్యూల్​ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APPSC | గ్రూప్-1 మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. మే...

    Vijender Singh | క్రికెటర్లపై భారత మాజీ బాక్సర్ సంచలన వ్యాఖ్యలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijender Singh | క్రికెటర్లు మోసకారులని, వయసు తగ్గించుకొని ఆడుతారని భారత మాజీ బాక్సర్, ఒలింపిక్...

    More like this

    NEET Exam | నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్​ పరీక్షపై...

    Hyderabad | మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | ఈ చిత్రాన్ని చూస్తే ‘మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను.. చినుకె కురిసెను..’ అంటూ...

    APPSC | గ్రూప్​ –1 షెడ్యూల్​ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APPSC | గ్రూప్-1 మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. మే...
    Verified by MonsterInsights