అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakistan border : జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) Line of Control (LoC) వెంబడి ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత్ సేన బలమైన ప్రతిదాడిని నిర్వహిస్తోంది. దీంతో పాకిస్తాన్ దళాలు తమ స్థావరాలను వదిలివేసి, జాతీయ జెండాలను తొలగించాయని అధికార వర్గాల సమాచారం. ఇది పాక్ శ్రేణుల్లో పెరుగుతున్న ఆందోళన, స్పష్టమైన తిరోగమనాన్ని సూచిస్తోంది.
ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు International Border వెంబడి పాకిస్తాన్ సైన్యం బరి తెగించి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్, బారాముల్లా, కుప్వారా Nowshera , Sundarbani , Akhnoor , Baramulla , Kupwara తో సహా అనేక ప్రాంతాలలో భారత సైన్యం నుంచి పాకిస్తాన్ దళాలు తీవ్ర ప్రతీకార కాల్పులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ సేనలు వెనక్కి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.