అక్షరటుడే, న్యూఢిల్లీ: Ban Pakistani flights : భారత్ గగనతలంపై పాకిస్తాన్ విమానాలు ప్రయాణించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్ గామ్ దాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకొంది. ఈ నిషేధం మే 23 వరకు కొనసాగనుంది.
పాకిస్తాన్ విమానాలను భారత్ గగనతలంపై అనుమతి ఉండనందున ఇకపై ఆగ్నేయాసియా దేశాలైన మలేసియా, బంగ్లాదేశ్ లకు పాక్ విమానాలు వెళ్లాలంటే వెళ్లడానికి చైనా కానీ, శ్రీలంక ఆకాశ మార్గాలను పాకిస్తాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు పాక్ నౌకలు కూడా మన దేశ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని కేంద్రం భావిస్తోంది. కాగా, పాక్ తన గగనతలం గుండా భారత విమానాలు వెళ్లకుండా ఇప్పటికే నిషేధం విధించింది.