అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Farmers | తెలంగాణ ప్రభుత్వం telangana govt రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వారికి బోనస్ డబ్బులు వెంటనే జమ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి minister uttam kumar reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సూచించారు. కాంటా అయిన ధాన్యం బస్తాలు మిల్లుల్లో అన్లోడింగ్ చేయగానే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాకుండా సన్నరకం ధాన్యం సాగు చేసిన అన్నదాతలకు బోనస్ డబ్బులు కూడా వెనువెంటనే జమ చేయాలన్నారు.
ప్రభుత్వ సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోంది. దీంతో యాసంగి సీజన్లో చాలా మంది రైతులు సన్నాలనే సాగు చేశారు. వారు ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయిస్తున్నారు. అయితే తొలుత మద్దత ధర మాత్రమే చెల్లిస్తున్న ప్రభుత్వం, తర్వాత రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తోంది.