More
    Homeబిజినెస్​Stock Market | స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

    Stock Market | స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) స్వల్ప నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం 82 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొంది. లాభనష్టాలమధ్య ఊగిసలాడి చివరికి 46 పాయింట్ల నష్టంతో 80,242 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(Nifty) 7 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా చివరికి 1.75 పాయింట్ల నష్టంతో 24,334 వద్ద ముగిసింది. భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు గురువారం మార్కెట్లకు సెలవు(Holiday) కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ప్రధాని మోదీ(Modi) రష్యా పర్యటనను రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్‌పై భారత్‌ దాడి చేసే అవకాశాలున్నాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్లు(Investors) చివరి అరగంటలో అమ్మకాలకు పాల్పడడంతో సెన్సెక్స్‌ రెండు వందలకుపైగా పాయింట్లు పడిపోయింది. క్యూ4 ఫలితాలు బాగుండడంతో విశాల్‌ మెగా మార్ట్‌(Vishal Mega Mart) 10 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌(Bajaj finserv), బజాజ్‌ ఫైనాన్స్‌, ట్రెంట్‌ కంపెనీలు మంచి ఫలితాలనే ఇచ్చినా ఇటీవల ర్యాలీ తీయడం, మార్కెట్‌ సెంటిమెంట్‌ నెగెటివ్‌గా ఉండడంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

    READ ALSO  Reliance Jio | బ్రాడ్‌ బ్యాండ్‌ రంగంలోనూ అంబానీదే అగ్రస్థానం.. దేశీయ మార్కెట్‌లో టాప్‌లో రిలయన్స్‌ జియో

    Stock Market | పీఎస్‌యూ స్టాక్స్‌లో భారీ నష్టాలు

    పీఎస్‌యూ స్టాక్స్‌(PSU stocks) భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.15 శాతం పడిపోగా.. పీఎస్‌యూ సూచీ 1.4 శాతం నష్టపోయింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.7 శాతం, మిడ్‌ క్యాప్‌(Mid cap) ఇండెక్స్‌ 0.7 శాతం పడిపోయాయి. బ్యాంకెక్స్‌ 0.57 శాతం తగ్గింది. డిఫెన్స్‌ స్టాక్స్‌ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రియాలిటీ సెక్టార్‌ మాత్రమే లాభాలతో ముగిసింది. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 975 లాభాలతో, 2,938 నష్టాలతో ముగియగా.. 150 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి.
    60 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 52 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్‌ అయ్యాయి. 12 అప్పర్‌ సర్క్యూట్‌ను, 5 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    READ ALSO  Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

    Stock Market | Top Gainers..

    బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ముగియగా 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. మారుతి 3.04 శాతం పెరగ్గా.. ఎయిర్‌టెల్‌(Airtel) 2.18 శాతం లాభపడింది. సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ ఒక శాతానికిపైగా పెరిగాయి.

    Stock Market | Top Losers..

    బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5.45 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 4.99 శాతం పడిపోయాయి. టాటా మోటార్స్‌ 3.22 శాతం, ఎస్‌బీఐ 2.91 శాతం నష్టపోయాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌(Tata steel), ఆసియా పెయింట్‌ ఒకశాతానికిపైగా క్షీణించాయి.

    Latest articles

    Women T20 World Cup | ఉమెన్స్ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎప్పుడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Women T20 World Cup | మహిళల టీ-20 ప్రపంచకప్-2026 (T-20 World Cup 2026) షెడ్యూల్‌ను...

    MP Arvind | ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎంపీ అర్వింద్​ నెరవేర్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

    Kamareddy SP | 100 రోజులు.. కీలక మార్పులు..

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | జిల్లా పోలీసు శాఖను గాడిలో పెట్టే దిశగా కామారెడ్డి ఎస్పీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ ప్రధాన కాలువ ద్వారా బుధవారం నీటి విడుదల చేపట్టారు....

    More like this

    Women T20 World Cup | ఉమెన్స్ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎప్పుడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Women T20 World Cup | మహిళల టీ-20 ప్రపంచకప్-2026 (T-20 World Cup 2026) షెడ్యూల్‌ను...

    MP Arvind | ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎంపీ అర్వింద్​ నెరవేర్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

    Kamareddy SP | 100 రోజులు.. కీలక మార్పులు..

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | జిల్లా పోలీసు శాఖను గాడిలో పెట్టే దిశగా కామారెడ్డి ఎస్పీ...