అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tenth Results | తెలంగాణ Telanganaలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ssc results వచ్చేశాయి. బుధవారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy ఫలితాలను విడుదల చేశారు. కాగా.. పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరిగాయి. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించారు. 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఇది 1.47 శాతం అధికం. గురుకులాల విద్యార్థులు 98.7 శాతం మంది పాస్ అయ్యారు. ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 94.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఈ క్రింది లింకులు క్లిక్ చేయవచ్చు.
https://results.bse.telangana.gov.in