More
    HomeజాతీయంStock market | రోజంతా ఒడిదుడుకులు

    Stock market | రోజంతా ఒడిదుడుకులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) రోజంతా ఒడిదుడుకుల(Volitility) మధ్య కొనసాగింది. చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. మంగళవారం ఉదయం 178 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 443 పాయింట్లు లాభపడిరది. 42 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 129 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీలు(Indices) పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌ 549 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు(Points) నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 80,288 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 24,335 వద్ద స్థిరపడ్డాయి.

    Stock market | రాణించిన డిఫెన్స్‌, ఐటీ షేర్లు..

    భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్‌(Defence) షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. పారస్‌ డిఫెన్స్‌ 17 శాతం, డాటా ప్యాటర్న్స్‌ 14.34 శాతం, బీఈఎల్‌ 4 శాతం మేర లాభపడ్డాయి. ఐటీ(IT), ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లు లాభపడ్డాయి. ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌, ఆటో, ఎనర్జీ(Energy) రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,830 లాభాలతో, 2,095 నష్టాలతో ముగియగా.. 129 కంపెనీలు(Companies) ఫ్లాట్‌గా ఉన్నాయి. 64 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 33 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్‌ అయ్యాయి. 10 అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పడిపోయింది.

    Stock market | Top Gainers..

    బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌(Index)లో 14 కంపెనీలు లాభాలతో ముగియగా 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్‌ 2.32 శాతానికిపైగా పెరిగి నిఫ్టీ, సెన్సెక్స్‌లు నిలబడడానికి కారణమైంది. టెక్‌ మహీంద్రా(Tech Mahindra) 2.14 శాతం పెరిగింది. ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ ఒక శాతానికిపైగా లాభపడ్డాయి.

    Stock market | Top Losers..

    అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.39 శాతం, సన్‌ఫార్మా(Sun pharma) 2.01 శాతం పడిపోయాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్టీపీసీ, ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ – 30 ఏప్రిల్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...

    Reels | రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడి దుర్మరణం

    అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు....

    earthquake | న్యూజిలాండ్​లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం...

    CMRF cheques | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, నిజాంసాగర్, బిచ్కుంద : మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ – 30 ఏప్రిల్ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...

    Reels | రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడి దుర్మరణం

    అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు....

    earthquake | న్యూజిలాండ్​లో వణికించిన వరుస భూకంపాలు.. ఆ దేశాల్లోనూ కంపించిన భూమి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : న్యూజిలాండ్ ను వరుస భూకంపాలు వణికించాయి. పశ్చిమ తీరంలో మొదట భారీ భూకంపం...
    Verified by MonsterInsights