More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్...

    Pawan Kalyan | పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pawan Kalyan | పాకిస్తాన్​కు అనుకూలంగా మాట్లాడే వారు అక్కడికే వెళ్లిపోవాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ ap deputy cm pawan kalyan​ ఫైర్​ అయ్యారు. మన దేశంలో పుట్టి.. మన దేశంలో ఉంటూ.. కొందరు పాక్​కు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు.

    పహల్​గామ్​ అమరులకు జనసేన ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరిలో నివాళులర్పించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపితే.. కొందరు పాక్​కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. కొందరు ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వాళ్లు వెంటనే ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ సూచించారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదంటూ పవన్ హితవు పలికారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. సెక్యులరిజం పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.

    READ ALSO  Bandi Sanjay | ఎవ‌రో చెబితే అధ్య‌క్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదు.. ప‌ద‌వి రాని వారు డ‌మ్మీలు కాదన్న బండి సంజ‌య్‌

    Pawan Kalyan | మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం..

    ఉగ్రదాడిలో బలైన మధుసూదన్ కుటుంబ సభ్యులకు జనసేన తరఫున రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘‘చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు? కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడా ఉండొద్దంటే ఎక్కడికెళ్లాలి? యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగంతో మాట్లాడారు.

    Latest articles

    Sangareddy | రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌.. 37కు చేరిన మృతుల సంఖ్య‌.. నేడు పాశ‌మైలారంనకు సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం (Pashamilaram)లో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi...

    TUWJ – IJU | టీఈఎంఏ జిల్లా కమిటీ ఎంపిక.. కార్యవర్గ సభ్యులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు: TUWJ - IJU : టీయూ డబ్ల్యూజే - ఐజేయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్...

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో...

    Train tickets | పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుండి అమ‌ల్లోకి.. ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Train tickets : దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ IRCTC ప్రయాణికులపై ఛార్జీల...

    More like this