అక్షరటుడే, వెబ్డెస్క్:Tamil Nadu | అడవిలో ఉండాల్సిన చిరుత పులి(Leopard).. ఏకంగా పోలీస్ స్టేషన్లోకే దూరింది. ఇది ఎక్కడా అనుకుంటున్నారా..? తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పులిని చూసి భయాందోళనకు గురైన పోలీసు సిబ్బంది స్టేషన్‌ను వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్గా మారింది.
Tamil Nadu | ఎక్కడంటే..
తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలో గల నడువట్టంలోని ఠాణాలోకి సోమవారం రాత్రి చిరుత ప్రవేశించింది. గూడలూరు-ఊటీ హైవే(Gudalur-Ooty Highway) పక్కన గల ఈ పోలీస్ స్టేషన్‌లోకి చిరుత దూరినట్లు తెలుస్తోంది. పీఎస్(PS) లోపలికి వచ్చి ఓ గదిలో వెళ్లింది.
అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. మరొక గదిలో విధుల్లో ఉన్న పోలీసు అధికారి చిరుతపులిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే అప్రమత్తమై శబ్దం చేయకుండా వెళ్లి చూశాడు. పులి వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే పీఎస్ తలుపులు మూసేసి తాళం వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది.
கூடலூர் நடுவட்டம் காவல் நிலையத்திற்குள் புகுந்த சிறுத்தை,லாவகமாக சென்று கதவை சாத்திய காவலர். @tnforestdept #TNForest #Leopard #nilgiris #ooty #yt pic.twitter.com/9iRIrcJMy9
— Srini Subramaniyam (@Srinietv2) April 29, 2025