అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ration Cards | ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల new ration cards జారీపై తీవ్ర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ congress ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పింది. దీంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు apply చేసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి cm revanth reddy జనవరి 26న కొత్త రేషన్ కార్డుల పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇంతవరకు కొత్తకార్డులు మంజూరు కాలేదు.
కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు వెరిఫై చేస్తున్నారు. గతంలో ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తుల జాబితాను ప్రదర్శించిన అధికారులు అందులో అర్హులకు కొత్తవాటిని మంజూరు చేయడానికి కసరత్తు జరుపుతున్నారు. కొత్త కార్డులతో పాటు పాత కార్డులు కుటుంబ సభ్యుల పేర్ల యాడింగ్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కార్డుల్లో పేర్ల చేర్పు ప్రక్రియ కొనసాగుతోంది.
Ration Cards | యాడ్ అవుతున్న పేర్లు
రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చడానికి గతంలో మీ సేవ కేంద్రాల mee seva centers ద్వారా ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతేగాకుండా గ్రామ సభల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించారు. వీటితో పాటు కులగణన సర్వే ఆధారంగా ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యులను చేర్చే ప్రక్రియ చేపడుతోంది. అధికారులు ఆయా దరఖాస్తులను పరిశీలిస్తూ.. పేర్లను రేషన్ కార్డుల్లో చేరుస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ నుంచే కొనసాగుతోంది. అయితే తొలివిడతలో కొందరి పేర్లనే చేర్చిన అధికారులు.. మిగతా వారి పేర్లను ప్రస్తుతం చేరుస్తున్నారు. కొత్తగా నమోదు అయిన వారికి మే నెలలో సన్న బియ్యం కూడా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొత్త కార్డుల జారీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
మీ కుటుంబ సభ్యుల పేరు రేషన్ కార్డులో యాడ్ అయిందో లేదో కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో పాత లేదా కొత్త రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.