అక్షరటుడే, హైదరాబాద్: Gold price : పసిడి ధర మళ్లీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరగగా, సిల్వర్ రేటు తగ్గింది.
సోమవారం 10 గ్రాముల పసిడి ధర రూ.98,500 ఉండగా, మంగళవారం నాటికి రూ.380 పెరిగి రూ.98,880 కు చేరింది. సోమవారం కిలో వెండి రూ.99,600 ఉండగా, మంగళవారం నాటికి రూ.207 తగ్గి రూ.99,393 గా ఉంది.