ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఓమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ.. కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి అచ్యుతానందన్​కృషి ఎంతో ఉందన్నారు. నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, కులరహిత సమాజం కోసం, కార్మిక వర్గాల రాజ్యాధికారం కోసం పనిచేశారని గుర్తు చేశారు. పదహారేళ్ల వయసులో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు హన్మాండ్లు, రఘురాం నాయక్, భానుచందర్, రేవతి, మహేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

    Achuthanandan | సీపీఎం ఆధ్వర్యంలో..

    కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్​ మృతి తీరనిలోటని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. నగరంలోని నాందేవ్​వాడలో ఉన్న కార్యాలయంలో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.

    READ ALSO  Malabar Gold and Diamonds Showroom | మలబార్​లో ఆర్టిస్ట్రీ షో

    ఈ సందర్భంగా రమేశ్​బాబు మాట్లాడుతూ…కేరళలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా అలుపెరుగని పోరాటం చేశారన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట రాములు, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, సురేష్, నగర నాయకులు రాములు, అనసూయమ్మ, దినేష్, రాజు, ఉద్ధవ్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Cyber Fraud | సీబీఐ పేరిట బెదిరించి.. రూ.35 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అరెస్ట్​ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. ఖాతాలను లూటీ...

    Job Mela | ప్రైవేటు రంగంలో ఉద్యోగ మేళా

    అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న...

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    More like this