ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ధర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని (Dharpally Police station) మంగళవారం సందర్శించారు. పోలీస్​స్టేషన్​లో కేసులకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

    CP Sai Chaitanya | ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి..

    ప్రజల భద్రపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ పేర్కొన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల (Case under investigation) ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్​స్పెక్టర్​కు (Circle Inspector) సూచించారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

    READ ALSO  Collectorate Control Room | కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    CP Sai Chaitanya | విలేజ్​ ఆఫీసర్లే కీలకం..

    సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో సిబ్బంది మమేకమవ్వాలని సీపీ సూచించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

    ఆన్​లైన్​ బెట్టింగ్ (Online betting)​ కారణంగా జరిగే అనర్థాలను వివరిస్తూ.. యువత ఆ వైపు వెళ్లకుండా చూడాలన్నారు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది 24గంటలూ హెడ్ క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించవద్దని సూచించారు. ట్రాఫిక్ రూల్స్​ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ ఏఎస్సై కళ్యాణి, తదితరులున్నారు.

    READ ALSO  Dengue Fever | రాజీవ్​నగర్​ తండాలో డెంగీ కలకలం.. రక్తనమూనాలు సేకరించిన వైద్యశాఖ

    Latest articles

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    More like this