ePaper
More
    HomeజాతీయంMiG -21 | ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక నిర్ణయం.. మిగ్​–21 సేవలకు వీడ్కోలు

    MiG -21 | ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక నిర్ణయం.. మిగ్​–21 సేవలకు వీడ్కోలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MiG -21 | దశాబ్దాలు భారత సైన్యానికి సేవలు(Indian Army Services) అందిస్తున్న మిగ్​ –21 ఇక కనుమరుగు కానున్నాయి. ఈ మేరకు భారత వైమానిక దళం(Indian Air Force) కీలక నిర్ణయం తీసుకుంది. మిగ్​ –21 యుద్ధ విమనాలు పాత తరానికి చెందినవి. ప్రస్తుత పరిస్థితులకు అవి అనుకూలం కావు. దీంతో పాటు మిగ్​ –21 విమానాలు తరుచూ కూలిపోయేవి. దీంతో వీటిని ఎగిరే శవపేటికలు అని ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలో వీటిని వాడొద్దని ఐఏఎఫ్‌ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ నుంచి మిగ్‌-21(MIG – 21) యుద్ధవిమానాలకు దశల వారీగా తొలగించనున్నట్లు తెలిపింది.

    MiG -21 | తేజస్​తో భర్తీ

    మిగ్​–21 యుద్ధ విమానాలను రష్యా నుంచి భారత్​ కొనుగోలు చేసింది. సుమారు 62 ఏళ్లుగా ఇవి భారత్​కు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 మిగ్​ –21 విమానాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు ఇవి భారత గగనతల రక్షణలో కీలక పాత్ర పోషించాయి. 1963లో మొదటి సారి భారత్​లోకి మిగ్​ 21 వచ్చింది. తర్వాత సుఖోయ్​ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే వరకు మిగ్​–21 విమానాలు భారత వైమానిక దళంలో అనేక సేవలు అందించాయి.

    READ ALSO  Udaipur Files Movie | ఉద‌య్‌పూర్ ఫైల్స్ చిత్రానికి తొల‌గని అడ్డంకులు.. కేంద్ర నిర్ణ‌యం కోసం వేచి ఉండాల‌న్న సుప్రీంకోర్టు

    మిగ్​–21 యుద్ధ విమానాల(MIG – 21 Fighter Jets) స్థానాన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్​ భర్తీ చేయాలని ఐఏఎఫ్​ యోచిస్తోంది. మిగ్‌21 విమానం చివరిసారిగా రాజ‌స్థాన్‌లోని బార్మ‌ర్ నుంచి 2023లో ఎగిరింది. వీటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్(Light Combat Aircraft Jet​)​లను వినియోగిస్తామని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రి(Air Chief Marshal VR Chowdhury) వెల్లడించారు.

    MiG -21 | ఆ యుద్ధాల్లో కీలక పాత్ర

    భారత్​ – పాకిస్తాన్​ మధ్య జరిగిన 1965 యుద్ధం, బంగ్లాదేశ్​ విముక్తి సమయంలో 1971 జరిగిన యుద్ధంలో మిగ్​–21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. 1999 కార్గిల్ యుద్దం, 2019 బాలకోట్ వైమానిక దాడుల్లో సైతం ఇవీ సేవలు అందించాయి. మిగ్​ 21 యుద్ధ విమానాలను భారత్ మొదట రష్యా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం సాంకేతిక బదిలీ చేయడంతో 600 విమానాలు భారత్​లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) తయారు చేసింది.

    READ ALSO  Encounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

    Latest articles

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    More like this

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...