ePaper
More
    HomeతెలంగాణPod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

    Pod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pod Taxis | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. నగరంలో జనాభా పెరగడంతో ట్రాఫిక్​ కూడా పెరిగి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్​ కష్టాల చెక్​కు మెట్రో రైలు(Metro Train)ను ప్రవేశ పెట్టినా.. ఇంకా రద్దీ అధికంగానే ఉంది. ఒక్క వర్షం పడితే నగరవాసులు గంటల పాటు ట్రాఫిక్​లో ఉండిపోతున్నారు. ఈ క్రమంలో మహా నగరంలో కొత్తగా పాడ్ ​ట్యాక్సీలు (Pod Taxis) ప్రవేశ పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో ట్రాఫిక్​ కష్టాలు తీరుతాయని భావిస్తారు.

    Pod Taxis | ఏమిటిఈ  పాడ్​ ట్యాక్సీలు

    పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (Personal Rapid Transit) అనేది పట్టణ ప్రాంతాలలో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఉపయోగించే రవాణా వ్యవస్థ. డ్రైవర్​ లేకుండానే ఇవి నడుస్తాయి. చిన్న బాక్సుల మాదిరిగా ఉండే వీటిని పాడ్​ ట్యాక్సీలు అని కూడా అంటారు. ప్రత్యేకంగా నిర్మించిన మార్గాల్లో మాత్రమే ఇవి ప్రయాణించగలవు. ట్రాఫిక్​ రద్దీని (Traffic Congestion) నియంత్రించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక్కో పాడ్​ ట్యాక్సీలో నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణం చేయవచ్చు.

    READ ALSO  BC Reservations | బీసీ కోటా.. వీడ‌ని ఉత్కంఠ‌.. సందిగ్ధంలో కాంగ్రెస్ స‌ర్కారు

    Pod Taxis | పలు మార్గాలపై దృష్టి

    ట్రాఫిక్​ రద్దీని పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) పాడ్​ ట్యాక్సీలపై దృష్టి పెట్టింది. పెరుగుతున్న వాహనాలతో నగరంలో ప్రజలు ట్రాఫిక్​ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో పాడ్​ ట్యాక్సీలు ప్రవేశపెట్టాలని యూఎంటీఏ యోచిస్తోంది. పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ హైదరాబాద్​కు అనుకూలంగా ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రధానంగా ఐటీ కారిడార్​, వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మొదట ఈ విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నారు.

    Pod Taxis | కాలుష్యరహితంగా..

    ప్రస్తుతం పాడ్​ ట్యాక్సీలు దుబాయి, లండన్​లో అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్​లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెవార్​ ఫిల్మ్​ సిటీ వరకు వీటిని అందుబాటులోకి తీసుకున్నారు. ఈ మేరకు డీపీఆర్​కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్​(Hyderabad)లో వాహనాలు పెరగడంతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో త్వరలో డీజిల్​ వాహనాలను హైదరాబాద్​లోకి అనుమతించబోమని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ప్రకటించారు. ఎలక్ట్రిక్​ వాహనాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తామన్నారు. ఈ క్రమంలో విద్యుత్​తో నడిచే పాడ్​ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్​తో పాటు కాలుష్యం కూడా తగ్గనుంది.

    READ ALSO  Gold Prices | పసిడి పరుగులు.. రూ.లక్ష మార్క్​ను టచ్​ చేసిన ధర

    Latest articles

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    Kamareddy | భార్యపై కోపం.. మొదటి భర్త కూతురి హత్యకు ప్లాన్.. కిడ్నాప్ చేసి దొరికిపోయిన భర్త

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : రెండో పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న కోపాన్ని ఆమె మొదటి భర్తకు...

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    More like this

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    Kamareddy | భార్యపై కోపం.. మొదటి భర్త కూతురి హత్యకు ప్లాన్.. కిడ్నాప్ చేసి దొరికిపోయిన భర్త

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : రెండో పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న కోపాన్ని ఆమె మొదటి భర్తకు...

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...