అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jagdeep Dhankhar Resign | ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Vice President Jagdeep Dhankhar) రాజీనామా అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన రాజీనామా(Resign) చేయడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికి.. లోతైన కారణాలు ఉండి ఉంటాయని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేష్(Congress MP Jairam Ramesh) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. నిబంధనలు, ప్రొటోకాల్‌ను ధన్‌ఖడ్ పాటించేవారన్నారు.
Jagdeep Dhankhar Resign | అప్పుడే ఏదో జరిగింది
బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా(JP Nadda), రిజిజు(Rijiju) ఉద్దేశపూర్వకంగా రాలేదని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ విషయంలో ధన్‌ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సోమవారం మధ్యాహ్నం 1గంటల నుంచి 4:30 గంటల మధ్య ఏదో జరిగిందన్నారు. ఆయన రాజీనామాకు లోతైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవాలన్నారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) జగదీప్ ధన్‌ఖడ్‌ను ఒప్పించాలని కోరారు.
ఇతర విపక్ష నాయకులు సైతం జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై స్పందించారు. ఆయన అధికార, విపక్షాలను సమానంగా చూసేవారని పేర్కొన్నారు. శివసేన యూబీటీ నాయకులు ఆనంద్ దూబే(Shiva Sena UBT Leader Anand Dubey) స్పందిస్తూ.. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం బాధాకరమన్నారు. ఆరోగ్య కారణాలతో అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందు లేదా సమావేశాలు పూర్తయిన తర్వాత రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ఉప రాష్ట్రపతి రాజీనామా తనకు వ్యక్తిగతంగా నచ్చలేదని కపిల్ సిబల్ అన్నారు.